పొలాల్లో పాముల కదలికలు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఈ చిత్రం AI ద్వారా రూపొందించింది.

వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు పొలాల్లో పాములు ఉంటాయి . రైతు జాగ్రత్త వహించాలి.

మాడుగుల 9 న్యూస్ అక్టోబర్ 6 : వర్షాలు పడడం వల్ల పొలాల్లో తేమ కారణంగా పాములు పొదలు, రాళ్ల కుప్పలు, గడ్డి ప్రాంతాల్లోకి చేరే అవకాశం ఉండటంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొలాల్లో నడిచేటప్పుడు ముందుగా కర్రతో పరిసరాలను పరిశీలించడం, రాత్రివేళ టార్చ్‌ వెంట తీసుకెళ్లడం, చేతులను రంధ్రాలు లేదా పొదల్లో పెట్టకుండా జాగ్రత్త వహించడం అవసరం. పాము కనిపించినప్పుడు దానికి దగ్గరగా వెళ్లకుండా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పాము కాటుకు పాము కాటుకు గురైనప్పుడు భయాందోళనకు గురికాకుండా బాధితుడు ప్రశాంతంగా ఉండాలి కదలికలు ఎక్కువగా చేయకుండా  బాధితుడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని నిపుణులు సూచిస్తున్నారు. పాము కాటుపై అపోహలకు లోనుకాకుండా తక్షణ వైద్య చికిత్స పొందడం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు