అనకాపల్లి జిల్లాకు రూ.2,050 కోట్ల తాగునీటి ప్రాజెక్టు!


అనకాపల్లి జిల్లాకు గుడ్ న్యూస్: రూ. 2,050 కోట్లతో అమరజీవి జలధార.. 1,223 గ్రామాలకు తాగునీరు!

మాడుగుల 9 న్యూస్ అక్టోబర్ 7 : అనకాపల్లి జిల్లా పరిధిలోని 1,223 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రూ.2,050 కోట్లతో భారీ ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు లభించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ఏలేరు, తాండవ రిజర్వాయర్ల ద్వారా ఈ మెగా వాటర్ గ్రిడ్ పనులను రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. దీని ద్వారా 20 మండలాల్లోని దాదాపు 13 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కొత్తగా 94,532 ఇంటింటి కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఏలేరు పనులను NCC, తాండవ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ ప్రాజెక్టుతో గ్రామాలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు