అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 28 : గుజరాత్ రైతులకు అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 24వ విడత నిధులను అక్టోబర్ 30న విడుదల చేయనున్నారు. గుజరాత్లోని బనస్కాంత్ జిల్లా భిల్డీ పట్టణంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నిధులను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జీతు వాఘాని వెల్లడించారు.ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.18,680 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందనుంది. అర్హులైన రైతులకు రూ.2,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతులు తమ ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలను సరిచూసుకోవాలని చూసించారు.

0 కామెంట్లు