అనకాపల్లి (మాడుగుల 9 న్యూస్) అక్టోబర్ 29 : మాడుగుల మండలం ఒమ్మలి గ్రామంలో కొల్లిమళ్ళ వారి కల్లాలు కాలువ నీటితో ముంపునకు గురవుతున్నాయి. నీరు పాకల చుట్టూ చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎన్నో ఏళ్లుగా పాకలు ముంపుకు గురవుతున్న పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ సమస్య ఇలాగే కొనసాగుతున్నా, ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సారీ ఇదే పరిస్థితి ఎదురవుతున్నా సమస్యకు పరిష్కారం చూపకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, కాలువ నీరు కల్లాల్లోకి రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.

0 కామెంట్లు